MGM Hospital : ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది;
MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో గతంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న కిడ్ని వ్యాధి బాధితుడు శ్రీనివాస్... కాలి వేలును ఎలుకలు కొరికేశాయి. గమనించిన శ్రీనివాస్ బంధువులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స అందించారు. అయితే మరోసారి శ్రీనివాస్ కాళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్... ఎలుకల దాడి కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.