TS: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ ప్రారంభం

Update: 2024-12-05 07:00 GMT

ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్‌ హౌస్‌ ఏర్పాటు చేస్తారు. కాగా, మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు. ఇక దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు చెందాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం వెల్లడించారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యం ఇస్తామని, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని స్పష్టం చేశారు.

లబ్ధిదారుల ఎంపికలో ఏఐ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ ను ఆవిష్కరించిన రేవంత్... అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం కృత్రిమ మేధను వినియోగిస్తామని వెల్లడించారు. గోండులు, ఆదివాసీలు, గిరిజనులకు ఇళ్లు కట్టిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తామన్నారు.

Tags:    

Similar News