గత ఏడేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది : మంత్రి తలసాని
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించిందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డిలు అన్నారు.;
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించిందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డిలు అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు.. మొక్కలు నాటి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పేదల కోసం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. షామీర్పేటలో అక్రమంగా పేదల ఇళ్ల పట్టాలు అమ్ముకున్నవారిని జైలుకు పంపిస్తామని మంత్రి హెచ్చరించారు.