45 నిమిషాల్లోపు నిర్ణయం చెప్పాలి.. లేదంటే ఆర్డర్ ఇస్తాం : తెలంగాణ హైకోర్టు
ఇవాళ్టితో ముగిసిన నైట్ కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 45 నిమిషాలు గడువు ఇచ్చింది హైకోర్టు;
సర్కారు వైఖరిపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఇవాళ్టితో ముగిసిన నైట్ కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 45 నిమిషాలు గడువు ఇచ్చిన హైకోర్టు... ఆలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. లేదంటే ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. పాలనా విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకి లేదని వ్యాఖ్యానించింది.