Dalit Bandh : దళితబంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Dalit Bandh : దళితబంధు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.;
Dalit Bandh : దళితబంధు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దళితబంధు పథకంపై ముందుకు వెళ్లొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. దళితబంధు అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేశారు. పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నాలుగు పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది.