High Court: ఒమిక్రాన్ వేళ.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు
High Court: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది..;
High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరిగింది.. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. సంక్రాంతి వేడుకల్లోనూ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంది.. రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలని సూచించింది.