తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. ఇంటర్ ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సమాచారం ఇచ్చింది. ఈ నెల 22న (ఏప్రిల్) ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రక్రియ సాగేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఫలితాలు చెక్ చేసుకోండిలా...
వెబ్‌సైట్ tsbie.cgg.gov.inకి వెళ్లాలి.
“TG Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
Inter First Year లేదా Second Year ను ఎంచుకోవాలి.
హాల్ టికెట్ నంబర్ సహా మిగిలిన వివరాలు ఎంటర్ చేయండి
అనంతరం ఫలితాలను చూడండి.