TG Inter Results : ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు.

Update: 2025-04-19 11:30 GMT

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు సైతం ఏర్పాటు చేయనున్నారు.మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి.

Tags:    

Similar News