Telangana: ఐటీలో దూసుకెళ్తున్న తెలంగాణ: కేటీఆర్
Telangana: ఐటీలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని చెప్పారాయన.;
Telangana: ఐటీలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని చెప్పారాయన. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ తెచ్చామని.. టీ హబ్ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు కేటీఆర్.
త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి వర్క్స్ ప్రారంభిస్తామని చెప్పారాయన. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉందని చెప్పారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలతో పనిచేస్తున్న స్కై రూట్ ధృవ వంటి స్టార్టప్‌లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయన్నారు కేటీఆర్.
ఇక.. రాష్ట్రంలో పది లక్షల గృహాలకు ఇంటర్నెట్ అందించే టి-ఫైబర్ ఈ ఏడాది పూర్తవుతుందని చెప్పారు. 2050 వరకు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.