కరోనా పూర్తిగా పోలేదు.. లాక్‌డౌన్ వద్దంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి కేటీఆర్
కరోనా పూర్తిగా పోలేదని.. లాక్‌డౌన్ రావొద్దంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేటీఆర్ హితువు పలికారు.;
హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూసాపేటలో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కేటీఆర్. 3 వేల 500 కోట్లతో సమగ్ర డ్రైనేజీ పునర్ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. కైతలాపూర్‌లో డంపింగ్ యార్డు సమస్య ఉందన్న ఆయన.. స్థానికులకు ఇబ్బంది లేకుండా చెత్త తరలింపు పాయింట్లు పెడతామన్నారు.
వానాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని.. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా పూర్తిగా పోలేదని.. లాక్‌డౌన్ రావొద్దంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేటీఆర్ హితువు పలికారు.
అంతకుముందు హైటెక్ సిటీలో రైల్వ్ అండర్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించారు. 410 మీటర్ల పొడవు, 20 .60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై-టెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది.