Minister Harish Rao: నాడు సందుల్లో పందులు.. నేడు సుందరంగా వీధులు: మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao: తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు చలోక్తులు విసిరారు.;
Minister Harish Rao: తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు చలోక్తులు విసిరారు. నాడు సందుల్లో పందులు తిరుగాడేవన్నారు. నేడు టీఆర్ఎస్ పాలనలో సందులు సుందరంగా తయారై పందులు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఫోర్ లైన్ రోడ్లు.. మిరుమిట్లు గొలిపే లైట్లతో.. పట్టణాలు కొత్తశోభను సంతరించుకున్నాయని చెప్పారు.
అలాగే కాంగ్రెస్ పార్టీపైనా సెటైర్లు వేశారు. హేమాహేమీలుగా చెప్పుకునే కాంగ్రెస్, టీడీపీ హయాంలో జిల్లాకో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఉండేదని ఎద్దేవా చేశారు. నేడు బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికో డయాలసిస్ సెంటర్ ఉందన్నారు. జగిత్యాల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ది పనులకు హరీశ్‌రావు శంకుస్థాపనలు చేశారు.