70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపించాం: హరీష్‌రావు
గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు.;
గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశం మొత్తం రైతుల పరిస్థితి బాగోలేకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.. దేశంలో ఎక్కడా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తోందని హరీష్‌రావు గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 13వేల కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఖర్చు పెడుతున్నట్లు మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.