KTR : నేను కాదు... సోనూసూదే సూపర్ హీరో.. కేటీఆర్ ట్వీట్..!
కోవిడ్ -19 సంక్షోభం సమయంలో, వైద్య సహాయం అవసరమైన వారికి మద్దతునిచ్చిన వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. సోనూ సూద్ అందరికంటే ఎక్కువ.;
మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో సోనూ సూద్‌ను సూపర్ హీరో అని అన్నారు. ఆయన మాటలకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సోను, అవసరమైన సమయంలో మంత్రిగా తెలంగాణ ప్రజలకు మీరు సహాయం చేస్తున్నారు.
కోవిడ్ -19 సంక్షోభం సమయంలో, వైద్య సహాయం అవసరమైన వారికి మద్దతునిచ్చిన వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. సోనూ సూద్ అందరికంటే ఎక్కువ. అతడు కరోనా పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు.
అడగిన వారికి కాదనకుండా ఆయన చేస్తున్న నిస్వార్థ కృషిని తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు గుర్తించారు.
ఇటీవల కెటిఆర్ నుండి సహాయం పొందిన ఒక వ్యక్తి, అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నాడు. ఓ వ్యక్తి స్నేహితుడి తండ్రికి ఆక్సిజన్ సిలిండర్ కావాలని కోరగా వెంటనే కేటీఆర్ స్పందించి వారికి ఆక్సిజన్ అందేలా చూశారు.
తన విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన మంత్రికి ట్విట్టర్ యూజర్ కేటీఆర్ ని "నిజమైన సూపర్ హీరో" అని సంభోధించారు. "TRKTRTRS @KTRoffice మరోసారి మీకు ధన్యవాదాలు. మేము అభ్యర్థించిన వెంటనే # ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను 10 గంటల్లో అందజేశారు.
మీరు ఈ రోజు వరకు చాలా మందికి సహాయం చేసారు. రాష్ట్ర ప్రజలు మీ నిరంతర సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేరు. మీరు నిజమైన # సూపర్‌హీరో " అని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
అతడు రాసిన ట్వీట్‌పై స్పందిస్తూ కెటిఆర్ "సూపర్ హీరో" అని సంబోధించాల్సినది నన్ను కాదు సోను సూద్ ని. "నేను మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని.
ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కానీ ఏమీ ఆశించకుండా నటుడు సోనూ సూద్ చేస్తున్న సహాయం మరువలేనిది. ఆయనే నిజమైన సూపర్ హీరో అని కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే, బాధలో ఉన్న ఇతరులకు మీరు కూడా దయతో సహాయం చేయండి "అని రాసుకొచ్చారు.
థ్యాంక్యూ సో మచ్ సర్.. తెలంగాణ రాష్ట్రం మీ నాయకత్వంలో ఎంతో బావుంది. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. కాబట్టి మీరే రియల్ హీరో. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్ కేటీఆర్ కు రీ ట్వీట్ చేశారు.