మహిళను చూసి ముందుకు వెళ్లి.. యూటర్న్ తీసుకుని మరీ మంత్రి పరామర్శ..!
ప్రజాప్రతినిధులు రోడ్లపై వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే స్పందించి తమ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలించి మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు.;
ప్రజాప్రతినిధులు రోడ్లపై వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే స్పందించి తమ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలించి మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కూడా తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చొని ఉన్న ఓ మహిళను పరామర్శించారు మంత్రి.. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్‌పల్లి మండల పర్యటనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో లంగర్‌హౌస్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని సబితా గమనించారు. అయితే అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్లటంతో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుని ఆ మహిళ వద్దకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ మాటలు రావని సైగలతో చెప్పడంతో ఆమెకు నీళ్ళు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు.