Telangana Panchayat Elections : తుది దశకు పంచాయతీ ఎన్నికలు.. ఆధిక్యం ఏ పార్టీకో..?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. బిఆర్ఎస్ రెండు విడతల్లోనూ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు తమకే వస్తాయి అనుకుంటే ఆ స్థాయిలో రాలేకపోయాయి. బిఆర్ఎస్ కూడా ముందు నుంచి చెబుతున్న నెంబర్ కంటే కొంచెం తగ్గింది. ఇక మూడో విడతలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు. మూడో విడతలో 182 మండలాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 3752 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 28,406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బరిలో 12640 మంది అభ్యర్థులు ఉన్నారు.
గత రెండుసార్లు జరిగిన ఎన్నికల కంటే ఇవి చాలా భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఇప్పటివరకు చాలాచోట్ల కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు ఉన్నచోట కొంత తక్కువగానే సర్పంచ్ స్థానాలు గెలిచింది. కానీ మూడో విడతలు మాత్రం అలా జరగనివ్వబోమని చెబుతోంది. మూడో విడతలో తమ టార్గెట్ కచ్చితంగా రీచ్ అవుతామని అంటున్నారు. గులాబీ పార్టీ కూడా ఈ మూడో విడత ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే గత రెండు విడతల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేవు ఆ పార్టీకి. అందుకే మూడో విడత ఎన్నికల్లో చాలా వరకు గులాబీ నేతలు అప్రమత్తంగానే ఉంటున్నారు. బిజెపి అయితే ఈ సర్పంచ్ ఎన్నికలను పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఆ పార్టీ నేతలు గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా ప్రచారం చేసినట్టు కనిపించలేదు.
అందుకే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల కంటే చాలా తక్కువగానే సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు బిజెపిలో కొంత అసంతృప్తిని రాజేసినట్టు కనిపిస్తోంది. ఈ మూడో విడత ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో ఎప్పుడూ ఓటు పోలింగ్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తుంటాయి. మరి మూడో విడత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే.