Telangana: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఉండాల్సిందే..!

Oxygen Plants: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీ బట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Update: 2021-07-30 06:17 GMT

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీ బట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయని ఆస్పత్రుల గుర్తింపు రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. ప్లాంట్‌ల ఏర్పాటుకు ఆగస్టు 31వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. 200 వరకూ బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 500 LPM కెపాసిటీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌లు ఉండాలని పేర్కొంది. 200 నుంచి 500 బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 1000 LPMతోను, 500కి మించి పడకలు ఉన్న ఆస్పత్రుల్లో 2వేల LPMతోను ఆక్సిజన్ ప్లాంట్‌లు ఉంటాలని ఉత్తర్వుల్లో ప్రకటించింది.

Tags:    

Similar News