TELANGANA SUMMIT: అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఏర్పాట్లు... డిసెంబరు 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహణ.. అంతర్జాతీయ స్థాయి ఉత్సవంలా ఏర్పాట్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం, ఈ సమ్మిట్‍కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సమ్మిట్‌ను నిర్వహించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమ్మిట్‍కు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం సీఎంవో అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు.
శాఖల వారీగా ఎంట్రీ
ఈ సమ్మట్ కు పాస్‍లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమ్మిట్‍కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని సీఎం ఆదేశించారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని ఏర్పాట్లను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. పోలీస్‍లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పార్కింగ్‍కు ఇబ్బంది రావొద్దన్నారు. బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, సమ్మిట్‍కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్‍ల వివరాలను ప్రదర్శించనున్నరాు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది.