Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నూతన వరుడితో సహా ముగ్గురు మృతి
తెలంగాణలో కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.;
తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కారు చెట్టును ఢీకొనడంతో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, అతని అల్లుడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇన్‌స్పెక్టర్ కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
వారం రోజుల క్రితం ఫిబ్రవరి 15వ తేదీన పెళ్లయిన ఆయన కుమార్తె ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ (57), అతని అల్లుడు పవన్ సాయి (25), డ్రైవర్ చంద్ర (23) మృతి చెందారు. పవన్ సాయి నివాసంలో జరిగిన విందుకు హాజరైన కుటుంబం హైదరాబాద్ నుంచి అనంతపురం వెళుతోంది. వారి మారుతీ స్విఫ్ట్ డిజైర్ అన్నసాగర్ ప్రాంతానికి రాగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.