Telangana : తలసరి ఆదాయం, వ్యయాల్లో తెలంగాణే టాప్

Update: 2025-02-03 11:45 GMT

తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలోనే కాదు ప్రజల వ్యయాలు, జీవన ప్రమాణాల్లోనూ పెద్దన్న పాత్రే పోషిస్తోంది. విద్యపై వ్యయం తగ్గుతుండగా, వైద్యంపై ప్రజల వ్యయాలు పెరుగుతున్నాయి. దేశంలోనే గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణాలు, నగరాల్లో పెరిగిన వ్యయాల తలసరితో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం పట్టణాల్లో రూ.820, గ్రామాల్లో రూ.633లకు పెరిగిందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. దీంతో తలసరి నెలవారీ ఖర్చు పెరిగిందని స్పష్టమవుతోంది. గ్రామాల్లో రూ.5,435కి, పట్టణాల్లో రూ.8,978కి చేరినట్లు ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం చూసుకుంటే రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ. 6, 199గా ఉంది. పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, గ్రామీణంలో కేరళ తలసరి ఆదాయంలో(రూ.6,611) అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఆదాయ వర్గాల వారీగా చూస్తే తెలంగాణలో గరిష్ఠంగా నెలకు రూ.12,619 ఖర్చు అవుతుంది.

Tags:    

Similar News