Funny Names To Hotels : ఐడియా అదుర్స్.. పైసా ఖర్చు లేదు.. పబ్లిసిటీ మాత్రం పీక్స్!
Funny Names To Hotels :భాగ్యనగరంలో బిజినెస్ అంటే మామలు విషయమా.. ? ఎంత చిన్న షాపు పెట్టాలన్నా.. ఓ మోస్తరు పబ్లిసిటీ మాత్రం తప్పదు.;
Funny Names To Hotels
Funny Names To Hotels : భాగ్యనగరంలో బిజినెస్ అంటే మామలు విషయమా.. ? ఎంత చిన్న షాపు పెట్టాలన్నా.. ఓ మోస్తరు పబ్లిసిటీ మాత్రం తప్పదు. ఇక పెద్ద బిజినెస్ అయితే పబ్లిసిటీ కోసం బాగానే ఖర్చు పెట్టాలి. ప్రకటనలు, బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారానికి లక్షలు ఖర్చు చేయాలి. ఇక ఇంకొదరైతే పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలను తీసుకువచ్చి కోట్లు ఖర్చు చేస్తుంటారు. బిజినెస్ ఆ రేంజ్ లో జరగాలంటే ఆ మాత్రం అవసరం మరి.. కానీ రూపాయి ఖర్చు లేకుండా డబుల్ పబ్లిసిటీ పొందుతున్నాయి కొన్ని హోటళ్లు. జనాల నోళ్ళలో నానుతున్న పేర్లను హోటల్ పేర్లుగా వాడేస్తూ ఎక్కడలేని పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు.
వివాహ భోజనంబు, తిన్నంత భోజనం, సుబ్బయ్య గారి హోటల్, తెలుగు నెస్, తెలుగింటి రుచులు, వియ్యాల వారి విందు, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, , మాయాబజార్, విలేజ్ ఆహారం, రాజుగారి రుచులు, గొంగూర, ఉలవచారు, నిరుద్యోగి ఎంఏ, బీఈడీ, కోడికూర చిట్టిగారె, మా ఊరు బిర్యానీ, పొట్ట పెంచుదాం,వచ్చి తినిపో ఇలాంటి జనాలకి బాగా అలవాటైనా పేర్లను పెడుతూ పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి పేర్లు పెడితే ముందుగా జనాలు నవ్వుకుంటారని అనుకున్నాము కానీ జనం కూడా బాగా ఆదరిస్తున్నారని హోటల్ యజమానాలు అంటున్నారు.