పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పై చర్చకు కాంగ్రెస్ , BRS సై అంటే... సై అంటూ పరస్పర సవాల్ కు దిగాయి. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి పదేళ్లలో ఏవరేమి చేశారో చర్చిద్దామన్నారు. ఇరు పార్టీలు ఈ విషయంపై రోడ్డెక్కడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.