Patnam Narender Reddy : కొడంగల్‌లో పట్నం నరేంద్ర రెడ్డి పాదయాత్రలో రచ్చ
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు నిరసిస్తు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రచ్చ రచ్చగా మారింది. అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతే కాదు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి షాద్ నగర్ వైపు తీసుకెళ్లారు.