తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతలుగా... ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థులను ఉదయం పరీక్షకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలుంటే 7032901383, 9000756178, 7075088812, 7075028881, 7075028882, 7075028885 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.