Telangana TET : నేడు ‘టెట్‌’ ఫలితాలు విడుదల

Update: 2025-07-22 07:45 GMT

తెలంగాణ టెట్ (TET) 2025 ఫలితాలు ఈరోజు (జూలై 22, 2025) విడుదల చేసారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేసారు. జూన్ 18 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైంది. తుది కీతో పాటు ఫలితాలను ఈరోజు విడుదల చేసారు. ఈ పరీక్షలకు పేపర్ 1కి 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది (74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది (73.48 శాతం) హాజరు కాగా, పేపర్ 2 (సోషల్ స్టడీస్)కు 53,706 మందికిగానూ 41,207 మంది (76.73 శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు.

Similar News