TG CABINET: నేడు స్థానిక ఎన్నికలపై క్లారిటీ.!
తెలంగాణ మంత్రివర్గం భేటీ నేడే
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర కేబినెట్‌సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. మీటింగ్ లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకుంటామని ఇదివరకే సీఎం ప్రకటించారు. కులగణన ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించినా కేంద్రం బీసీ బిల్లులకు ఆమోదం తెలపడం లేదు. రిజర్వేషన్లను 50శాతానికి పెంచేలా పంచాయతీరాజ్చట్టసవరణకు గవర్నర్సైతం ఆమోదం తెలపడం లేదు. హైకోర్టు 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. వీటితో పాటు 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం అమలుచేయడం లేదని కోర్టులో పిటిషన్దాఖలైంది. ఈ కేసు విచారణ ఈనెల 24కు వాయిదాపడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోర్టులో విచారణకు రానుంది.
ముందే సర్పంచ్ ఎన్నికలు
ఇప్పటికే బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్విడుదల చేశారు. ఒక రోజు సైతం నామినేషన్లు స్వీకరించారు. అయితే హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని, రిజర్వేషన్లను సవరించి ఎన్నికలను నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో 50శాతంతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో కేంద్రానికి మరికొంత సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహించడమా? లేకుంటే 50 శాతంతోనే ఎన్నికలు నిర్వహించడమా? అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. ముందుగా పార్టీల గుర్తులేని జరిగే సర్పంచ్ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీపరంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండటమో తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కోర్టుకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉండటంతో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయలేదు: ఒవైసీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు వ్యక్తిగతంగా మాత్రమే తాము సపోర్ట్ చేశామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. నియోజకవర్గాన్ని నవీన్ అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు ఇవ్వలేదన్నారు. BRSతో తమకు విభేదం లేదన్నారు. కేసీఆర్ అయినా తానైనా పార్టీలకు మంచి అనిపించేది చేస్తామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు.