TG: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు.. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని మార్గదర్శకాలు... రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ల అమలుకు ఆదేశం

Update: 2025-11-22 09:15 GMT

తె­లం­గా­ణ­లో గ్రామ పం­చా­య­తీ ఎన్ని­కల రి­జ­ర్వే­ష­న్ల­కు సం­బం­ధిం­చి రా­ష్ట్ర ప్ర­భు­త్వం శని­వా­రం జీవో వి­డు­దల చే­సిం­ది. సర్పం­చ్‌, వా­ర్డు సభ్యుల రి­జ­ర్వే­ష­న్ల వి­ధి­వి­ధా­నా­లు ఖరా­రు చే­సిం­ది. రి­జ­ర్వే­ష­న్లు 50 శా­తా­ని­కి మిం­చ­కూ­డ­ద­ని మా­ర్గ­ద­ర్శ­కా­లు జారీ చే­సిం­ది. తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు ప్ర­భు­త్వం వే­గం­గా అడు­గు­లు వే­స్తోం­ది. ఇం­దు­లో భా­గం­గా గ్రామ పం­చా­య­తీ రి­జ­ర్వే­ష­న్ల­పై సమ­గ్ర మా­ర్గ­ద­ర్శ­కా­లు వి­డు­దల చే­సిం­ది. సు­ప్రీం­కో­ర్టు ఆదే­శాల మే­ర­కు రి­జ­ర్వే­ష­న్ల­పై ప్ర­త్యేక కమి­ష­న్ ఏర్పా­టు చే­సిం­ది. మొ­త్తం రి­జ­ర్వే­ష­న్లు 50శాతం మిం­చ­కూ­డ­ద­ని ప్ర­భు­త్వ జీ­వో­లో స్ప­ష్టం చే­సిం­ది.

 జీవో విడుదల

గ్రా­మ­పం­చా­య­తీ ఎన్ని­క­ల­పై ప్ర­భు­త్వం జీవో వి­డు­దల చే­సిం­ది. గ్రామ పం­చా­య­తీ వా­ర్డు స్థా­నా­ల­కు 2024సా­మా­జిక, ఆర్థిక సర్వే ప్ర­కా­రం రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­యా­ల­ని, సర్పం­చ్ స్థా­నా­ల­కు 2011సె­న్స­స్ ప్ర­కా­రం ఎస్సీ, ఎస్టీ రి­జ­ర్వే­ష­న్లు, 2024సా­మా­జిక, ఆర్థిక సర్వే ప్ర­కా­రం బీసీ రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­యా­ల­ని జీ­వో­లో ఆదే­శిం­చిం­ది. రి­జ­ర్వే­ష­న్లు 50శాతం మిం­చ­కుం­డా కొ­త్త రి­జ­ర్వే­ష­న్ల­ను సి­ఫా­ర­సు చే­స్తూ డె­డి­కే­టె­డ్ కమి­ష­న్ ఇచ్చిన ని­వే­ది­క­ను మం­త్రి­వ­ర్గం ఇప్ప­టి­కే ఆమో­దిం­చిం­ది. ఈ ప్ర­క్రియ పూ­ర్తి­కా­గా­నే పం­చా­య­తీ రాజ్ శాఖ నుం­చి గ్రామ పం­చా­య­తీ­లు, వా­ర్డుల రి­జ­ర్వే­ష­న్ల­కు సం­బం­ధిం­చిన గైడ్ లై­న్స్ తో కూ­డిన జీ­వో­ను వి­డు­దల చే­సిం­ది. రో­టే­ష­న్ల వి­ధా­నం­లో రి­జ­ర్వే­ష­న్లు అమలు కా­నుం­డ­టం­తో గతం­లో ఉన్న రి­జ­ర్వే­ష­న్లు మా­ర­బో­తు­న్నా­యి. వా­ర్డు స్థా­నాల రి­జ­ర్వే­ష­న్ల­ను ఎం­పీ­డీ­వో­లు, సర్పం­చ్ స్థా­నాల రి­జ­ర్వే­ష­న్ల­ను ఆర్డీ­వో­లు ఖరా­రు చే­యా­ల­ని ని­ర్ధే­శిం­చిం­ది.

రొటేషన్ పద్ధతిలో....

ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ రి­జ­ర్వే­ష­న్ల­ను రొ­టే­ష­న్ పద్ద­తి­లో అమలు చే­యా­ల­ని ప్ర­భు­త్వం మా­ర్గ­ద­ర్శ­కా­ల్లో పే­ర్కొం­ది. రి­జ­ర్వే­ష­న్ కే­టా­యిం­పు­న­కు సా­మా­జిక, ఆర్థిక, ఉపా­ధి, రా­జ­కీయ, వి­ద్య సర్వే ఆధా­రం­గా ఉం­డా­ల­ని, సర్పం­చ్ రి­జ­ర్వే­ష­న్‌­కు 2011 జన­గ­ణ­న­తో­పా­టు SEEPC డేటా వి­ని­యో­గిం­చా­ల­ని మా­ర్గ­ద­ర్శ­కా­ల్లో పే­ర్కొం­ది. 100శాతం ఎస్టీ గ్రా­మా­ల్లో అన్ని వా­ర్డు­లు, సర్పం­చ్ స్థా­నా­లు ఎస్టీ­ల­కు మా­త్ర­మే రి­జ­ర్వ్ చే­యా­ల­ని పే­ర్కొం­ది. రి­జ­ర్వే­ష­న్లు కే­టా­యిం­పు చే­యా­ల­ని పే­ర్కొం­ది. ము­ను­ప­టి ఎన్ని­క­ల్లో రి­జ­ర్వ్ చే­సిన వా­ర్డు­లు/గ్రా­మా­లు అదే కే­ట­గి­రీ­కి మళ్లీ రి­జ­ర్వ్ చే­య­రా­ద­ని, 2019 ఎన్ని­క­ల్లో అమలు కాని రి­జ­ర్వే­ష­న్లు యథా­త­థం­గా కొ­న­సా­గ­వ­చ్చు­న­ని జీ­వో­లో ప్ర­భు­త్వం పే­ర్కొం­ది. వా­ర్డు రి­జ­ర్వే­ష­న్ల ని­ర్ణ­యం ఎం­పీ­డీ­వో, సర్పం­చ్ రి­జ­ర్వే­ష­న్ల ని­ర్ణ­యం ఆర్డీ­వో ఆధ్వ­ర్యం­లో జర­గా­ల­ని పే­ర్కొం­ది. ఎస్టీ రి­జ­ర్వే­ష­న్ల­ను మొదట ఖరా­రు చేసి, తరు­వాత ఎస్సీ , బీ­సీ­ల­కు రి­జ­ర్వే­ష­న్లు కే­టా­యిం­పు చే­యా­ల­ని పే­ర్కొం­ది. మహి­ళల రి­జ­ర్వే­ష­న్ అన్ని కే­ట­గి­రీ­ల­లో ప్ర­త్యే­కం­గా లె­క్కిం­చి అమలు చే­యా­ల­ని, మొదట మహి­ళ­లు, ఆ తరు­వాత లా­ట­రీ పద్ద­తి ద్వా­రా కే­టా­యిం­చా­ల­ని మా­ర్గ­ద­ర్శ­కా­ల్లో ప్ర­భు­త్వం పే­ర్కొం­ది.

Tags:    

Similar News