తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. వెలువడుతున్న ఫలితాల్లో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. గంటగంటకు ఆధిక్యాలు మారిపోవడం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా... బీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం హవా కొనసాగిస్తోంది. గులాబీ పార్టీ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు నిర్వేదంలో కూరుకుపోయాయి.