TG : తెలంగాణ రైజింగ్.. తొలి రోజే రూ. 3,97,500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు... తొలిరోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందాలు

Update: 2025-12-09 03:30 GMT

‘తె­లం­గాణ రై­జిం­గ్‌ గ్లో­బ­ల్‌ సమి­ట్‌’లో తొలి రోజే పె­ట్టు­బ­డు­లు వె­ల్లు­వె­త్తా­యి. సద­స్సు తొలి రో­జైన సో­మ­వా­రం రూ.3,97,500 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు పలు కం­పె­నీ­లు ప్ర­భు­త్వం­తో ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కు­న్నా­యి. సమి­ట్‌ ప్రాం­గ­ణం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి, ఉప ము­ఖ్య­మం­త్రి మల్లు భట్టి వి­క్ర­మా­ర్క, ఐటీ, పరి­శ్ర­మ­ల­శాఖ మం­త్రి దు­ద్ది­ళ్ల శ్రీ­ధ­ర్‌­బా­బు సమ­క్షం­లో కం­పె­నీల ప్ర­తి­ని­ధు­లు ఒప్పంద పత్రా­లు మా­ర్చు­కు­న్నా­రు. రి­ల­య­న్స్‌ గ్రూ­ప్‌­న­కు చెం­దిన ‘వం­తార’... తె­లం­గాణ ప్ర­భు­త్వ భా­గ­స్వా­మ్యం­తో ప్ర­పం­చ­స్థా­యి వన్య­ప్రా­ణుల సం­ర­క్షణ, నై­ట్‌ సఫా­రీ ఏర్పా­టు­కు ముం­దు­కొ­చ్చిం­ది. దే­శం­లో వన్య­ప్రా­ణుల పు­న­రా­వాస వ్య­వ­స్థ మె­రు­గు­తో పాటు శా­స్త్రీయ సం­ర­క్షణ, పరి­శో­ధన, ప్ర­జ­ల­కు అవ­గా­హన, నై­ట్‌­స­ఫా­రీ అను­భ­వా­ల­ను పం­చ­నుం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చిన మా­స్ట­ర్‌­ప్లా­న్‌­ను వం­తార బృం­దం వి­వ­రిం­చిం­ది. పర్యా­టక, అటవీ, పర్యా­వ­రణ శా­ఖ­లు అవ­స­ర­మైన సహా­యం అం­దిం­చేం­దు­కు అం­గీ­క­రిం­చా­యి. వన్య­ప్రా­ణి సం­ర­క్షణ, నై­ట్‌­స­ఫా­రీ ఏర్పా­టు­కు ముం­దు­కొ­చ్చి­నం­దు­కు సీఎం రే­వం­త్‌ అభి­నం­దిం­చా­రు. పర్యా­ట­కం పె­ర­గ­డం­తో పాటు స్థా­ని­కం­గా ఉద్యో­గా­లు వస్తా­య­ని పే­ర్కొ­న్నా­రు. అం­త­ర్జా­తీ­య­స్థా­యి నా­ణ్య­త­తో కూ­డిన రే­సిం­గ్, మో­టో­క్రా­స్‌ సదు­పా­యా­న్ని అభి­వృ­ద్ధి చే­సేం­దు­కు ‘సూ­ప­ర్‌­క్రా­స్‌ ఇం­డి­యా సం­స్థ’ ముం­దు­కొ­చ్చిం­ది.

 అమెరికా అధ్యక్షుడు కంపెనీ..

భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సి­టీ­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు తా­మ­ము సి­ద్ధం­గా ఉన్నా­మ­ని ఎరి­క్ వె­ల్ల­డిం­చా­రు. ట్రం­ప్ మీ­డి­యా అండ్ టె­క్నా­ల­జీ గ్రూ­ప్ కా­ర్పో­రే­ష­న్ లో.. అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్‌­కు చెం­దిన డో­నా­ల్డ్ ట్రం­ప్ రి­వో­క­బు­ల్ ట్ర­స్ట్‌­కు 52 శాతం వాటా ఉంది. ఈ ట్ర­స్ట్ కింద మరి­న్ని కం­పె­నీ­లు ఉన్నా­యి. ఫ్లో­రి­డా లోని సర­సో­టా కేం­ద్రం­గా ఈ కం­పె­నీ కా­ర్య­క­లా­పా­లు ని­ర్వ­హి­స్తోం­ది. డొ­నా­ల్డ్ ట్రం­ప్ తరచూ పో­స్టు­లు చేసే ట్రూ­త్ సో­ష­ల్‌­ను కూడా ఈ కం­పె­నీ ని­ర్వ­హి­స్తోం­ది. కాగా, హై­ద­రా­బా­ద్‌­లో ఓ ప్ర­ధాన రహ­దా­రి­కి అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ పేరు పె­ట్టా­ల­ని తె­లం­గాణ ప్ర­భు­త్వం ప్ర­తి­పా­దిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే

పెట్టుబడుల ప్రవాహం

అం­త­ర్జా­తీయ రే­సిం­గ్‌ కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్ద­డం­తో పాటు ట్రా­క్‌­లు, రై­డ­ర్‌ ట్రై­నిం­గ్‌ జో­న్లు, ప్రే­క్ష­కు­ల­కు మౌ­లిక సదు­పా­యా­లు, అతి­థ్య సౌ­క­ర్యా­లు కల్పి­స్తుం­ది. ప్ర­తి­పా­దిత లే­అ­వు­ట్‌­ను సం­స్థ ప్ర­ద­ర్శిం­చిం­ది. మో­టా­ర్‌ స్పో­ర్ట్‌ హబ్‌ హై­ద­రా­బా­ద్‌­ను స్పో­ర్ట్స్, ఎం­ట­ర్‌­టై­న్‌­మెం­ట్‌ కా­రి­డా­ర్‌­గా మా­ర్చ­నుం­ది. ఈ గమ్య­స్థా­నం జా­తీయ, అం­త­ర్జా­తీయ ఛాం­పి­య­న్‌­షి­ప్‌­ల­కు ఆతి­థ్య­మి­వ్వ­నుం­ది. మో­టా­ర్‌ స్పో­ర్ట్‌ పర్యా­ట­కం­తో పాటు కో­చిం­గ్, ఈవెం­ట్స్‌ ని­ర్వ­హణ ద్వా­రా స్థా­ని­కం­గా ఉపా­ధి అవ­కా­శా­లు పెం­చు­తుం­ది.  రా­ష్ట్రం­లో రూ.10 వేల కో­ట్ల­తో సమీ­కృత టౌ­న్‌­షి­ప్, ప్ర­పం­చ­స్థా­యి ఫి­ల్మ్‌ స్టూ­డి­యో­ను ఏర్పా­టు చే­సేం­దు­కు సల్మా­న్‌­ఖా­న్‌ వెం­చ­ర్స్‌ సం­స్థ ప్ర­ణా­ళిక ప్ర­క­టిం­చిం­ది.

Tags:    

Similar News