TG: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు.!

జూబ్లీహిల్స్‌ గెలుపు జోష్‌లో కాంగ్రెస్... త్వరలో పలు నియోజకవర్గాలకు బై పోల్.. స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్‌కు ఎన్నికలు

Update: 2025-11-16 06:30 GMT

తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ అధి­కా­రం­లో­కి వచ్చి రెం­డే­ళ్లు అవు­తోం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా వి­విధ ప్రాం­తా­ల్లో కాం­గ్రె­స్ ఎమ్మె­ల్యే­లు ఉన్నా­రు. కానీ హై­ద­రా­బా­ద్‌ పరి­ధి మా­త్రం చే­తి­కి చి­క్క­లే­దు. ఇక్కడ గత ఎన్ని­క­ల్లో ఒక్క­రం­టే ఒక్క అభ్య­ర్థి కూడా వి­జ­యం సా­ధిం­చ­లే­క­పో­యా­రు. ఉప ఎన్నిక రూ­పం­లో వచ్చిన అవ­కా­శా­న్ని కాం­గ్రె­స్ ఉప­యో­గిం­చు­కుం­ది. కం­టో­న్మెం­ట్‌­లో మొదట వి­జ­యం సా­ధిం­చిం­ది. ఇప్పు­డు జూ­బ్లీ­హి­ల్స్‌­లో కూడా వి­జ­యం సా­ధిం­చిం­ది. ఇదే క్ర­మం­లో మి­గ­తా ప్రాం­తా­ల్లో పట్టు­కో­సం ప్ర­య­త్ని­స్తోం­ది. దీని కోసం ఇప్ప­టి­కే స్కె­చ్ వే­సిం­ది. కాం­గ్రె­స్ పా­ర్టీ అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత చాలా మంది నా­య­కు­లు హస్తం గూ­టి­కి చే­రు­కు­న్నా­రు. వా­రి­లో ఎమ్మె­ల్యే­లు ఉన్నా­రు. వా­రం­తా బీ­ఆ­ర్‌­ఎ­స్‌­ను వీడి కాం­గ్రె­స్‌ పా­ర్టీ­లో­కి వచ్చా­రు. ఒక పా­ర్టీ­లో గె­లి­చి అధి­కార పా­ర్టీ­లో­కి వె­ళ్లిన వా­రి­పై అన­ర్హత వేటు వే­యా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ పో­రా­టం చే­స్తోం­ది. ఈ వి­ష­యం­లో సు­ప్రీం­కో­ర్టు వి­చా­రి­స్తోం­ది. ఇప్పు­డు ఈ కే­సు­ను తమకు అను­కూ­లం­గా మా­ర్చు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం భా­విం­చే అవ­కా­శం ఉంది. జూ­బ్లీ­హి­ల్స్ జో­ష్‌­ను కం­టి­న్యూ చే­స్తూ మరి­న్ని ఉపఎ­న్ని­క­లు ఎదు­ర్కొ­నేం­దు­కు సి­ద్ధ­మ­య్యే వ్యూ­హం రచిం­చే ఛా­న్స్ ఉం­దం­టు­న్నా­రు వి­శ్లే­ష­కు­లు.

ఆ రెండు పక్కా..?

బీ­ఆ­ర్‌­ఎ­స్ నుం­చి గె­లి­చి కాం­గ్రె­స్‌­లో చే­రిన ఎమ్మె­ల్యే­లు దానం నా­గేం­ద­ర్ (ఖై­ర­తా­బా­ద్), కడి­యం శ్రీ­హ­రి (ఘన్‌­పూ­ర్ స్టే­ష­న్)లపై త్వ­ర­లో స్పీ­క­ర్ వేటు వేసే అవ­కా­శం ఉం­ద­ని, దీం­తో ఈ రెం­డు ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఉప ఎన్ని­క­లు అని­వా­ర్యం కా­వ­చ్చ­ని రా­జ­కీయ వర్గా­ల్లో జో­రు­గా చర్చ నడు­స్తోం­ది. పా­ర్టీ ఫి­రా­యిం­పుల ని­రో­ధక చట్టం కింద బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్యే­లు­గా గె­లి­చి, ఆ తర్వాత కాం­గ్రె­స్‌­లో చే­రిన పలు­వు­రి­పై స్పీ­క­ర్ కా­ర్యా­ల­యం­లో వి­చా­రణ జరు­గు­తోం­ది. ఈ వి­చా­ర­ణ­లో దానం నా­గేం­ద­ర్, కడి­యం శ్రీ­హ­రిల వ్య­వ­హా­రం కీలక ఘట్టా­ని­కి చే­రు­కుం­ది. దానం నా­గేం­ద­ర్ బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్యే­గా ఉం­టూ­నే లోక్ సభ ఎన్ని­క­ల్లో ఏకం­గా కాం­గ్రె­స్ అభ్య­ర్థి­గా సి­కిం­ద్రా­బా­ద్ ఎంపీ స్థా­నా­ని­కి పోటీ చే­శా­రు. ఈ చర్య ద్వా­రా ఆయన పా­ర్టీ మా­రి­న­ట్లు స్ప­ష్టం­గా రు­జు­వైం­ది. జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్‌­ఎ­స్ సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని 24 వే­ల­కు పైగా మె­జా­ర్టీ­తో గె­లు­చు­కు­న్న కాం­గ్రె­స్ పా­ర్టీ, ఈ రెం­డు స్థా­నా­ల్లో ఉప ఎన్ని­క­లు వస్తే గె­లు­పు­పై అత్యంత ధీ­మా­తో ఉంది.

Tags:    

Similar News