TGPSC : టీజీపీఎస్సీ కీలక నిర్ణయం.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1నిష్పత్తిలో
టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1నిష్పత్తిలో జరపనున్నట్లు వెల్లడించింది. అదనపు అభ్యర్థులను పిలవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో పాటు పోటీదారులను ఆశకు గురిచేసినట్లు అవుతోందని కమిషన్ పేర్కొంది. కాగా ఇది వరకు మల్టీ జోనల్, జోనల్ పోస్టులకు 1:2, జిల్లా పోస్టులకు 1:3, దివ్యాంగుల కేటగిరీకి 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచేవారు. కొత్త సంస్కరణల వల్ల 1:1 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లేనని భావించవచ్చు. ఎందుకంటే పరిశీలనలో సరైన అర్హతలు, రిజర్వేషన్లు ప్రకారం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేనట్లు వెల్లడైనా, గైర్హాజరైనా తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలవనున్నారు.