తెలంగాణకి రానున్న EC బృందం
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన 12 మంది అధికారుల బృందం తెలంగాణకి రానుంది.;
రేపు తెలంగాణకి ఎన్నికల కమిషన్ అధికారుల బృందం రానుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన 12 మంది అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. రేపటి నుంచి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌లో సమీక్షలు నిర్వహించనున్నారు. 22న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమీక్ష జరపనున్నారు. 23న ఉదయం నుంచి 24న మధ్యాహ్నం వరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనుంది. 24న మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సీఎస్, కార్యదర్శులతో చర్చించనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఈ సమీక్షలు జరపనుంది.