Miss World : మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నేడే.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే
72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అమెరికా, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా ఓషియానియా ఖండాలనుంచి 109 మంది ఆదేశాల ముద్దుగుమ్మలు పాల్గొనగా దశలవారిగా జరిగిన పోటీలో 40 మంది ఫైనల్స్ కు చేరుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా కరీబియన్: హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (త్రినిటాడ్ టొబాగో), టాప్ మోడల్ పోటీలో ఆరెలీ జోకిమ్ (మార్టినిక్), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టో రికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్).
ఆఫ్రికా: హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా), టాప్ మోడల్ ద్వారా సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్)
యూరప్ : స్పోర్ట్ ఛాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తో పాటు బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్), టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హార్డ్స్ (ఐర్లాండ్), మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో).
ఆసియా ఓషియానియా: టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా మోనికా కేజీయా సెంబిరింగ్ (ఇండోనేషియా),
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా : ఇడిల్ బిల్గెన్ (టర్కీ), టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (భారతదేశం), మల్టీ మీడియా అవార్డు ద్వారా ఓపలసుచాతా (థాయిలాండ్) ఫైనల్స్ కు ఎంపికయ్యారు. మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ ల ప్యానెల్ ద్వారా ఎంపిక కయ్యారు.
క్వార్టర్ ఫైనల్స్ నుండి, ప్రతి ఖండం నుండి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, మరియు చివరిగా 4 ఖండ విజేతలు ఎంపికవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ ఎన్నికవుతుంది. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు. మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందచందా లకే ప్రాముఖ్యత కాకుండా, ఈ కార్యక్రమం తెలివి తేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, ఉద్దేశ్యం, నాయకత్వ లక్షణాలతో మహిళలను సాధికార తను ప్రపంచవ్యాప్తం చేస్తోంది.