యూటర్న్ తీసుకున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం.. బీఆర్ఎస్‌కు స్పీకర్ లేఖ..

Update: 2025-09-12 08:53 GMT

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో బీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని... కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని ఎమ్మెల్యేలు తెలిపారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసారని...తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారని కూడా వారు తమ వివరణలో పేర్కొన్నారు.

కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇక ఎమ్మెల్యేల నుంచి అనూహ్యమైన వివరణ రావడంతో... బంతి బీఆర్ఎస్ కోర్టులో పడింది. ఈ వివరణపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ స్పందన మూడు రోజుల్లోగా తేలియజేయాలని కోరుతూ స్పీకర్ లేఖ రాసారు. ఇక దీనిపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలే వరుస సంక్షోభాలతో ఇబ్బందుల్లో ఉన్న గులాబీ పార్టీకి ఈ అంశం కొత్త తలనొప్పిగా మారింది.

Tags:    

Similar News