TG : కేటీఆర్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి
ఫార్ములా ఈ-రేసు కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. నేటినుంచి ఈడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. జనవరి 7వ తేదీన ఈడీ ముందు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ లోపు మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఏ2, ఏ3లను ఈడీ విచారించనుంది. HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి నేడు ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.