బీజేపీ అధ్యక్ష పదవి రాలేదని అలిగి రాత్రి వరకు ఎవరైనా ఏమన్నా చేసుకుంటారేమోనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్వేశారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ, బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమే అని నిరూపితమైందన్నా రు. ఢిల్లీలో చామల మీడియాతో మాట్లాడుతూ 'కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిండు. అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుంది. కేంద్రం ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయో గిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్లో ముందుకు వెళ్లనున్నాయి. హైదరా బాద్ నగర ప్రజలకు కిషన్రెడ్డి చేసిందేమిటి? ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. అసలు ఢిల్లీ నుంచి తెలంగాణకు అమిత్ షా ఎందుకు వచ్చారో తెలియదు' అని అన్నారు.