రాష్ట్రంలోకి పేదలందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని, రానున్న కొద్దిరోజుల్లోనే రుణమాఫీ కాని రైతులకు మరో 10 వేల కోట్లను కేటాయిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ములుగు జిల్లాలో పలు అభివృ పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమా సీతక్క పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామన్నారు. మహిళ లను కోటిశ్వరులుగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టిన్నట్లుగా ఆమె తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా 19 రకాల వ్యాపారా లను ఎంపిక చేసిన్నట్లు వివరించారు. మరో మూడు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తా మన్నారు. 'రానున్న రోజులలో రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయల పింఛన్ పెంపు పథకాలను అమలు చేస్తాం. రూ. 18 వేల కోట్లను రైతు రుణమాఫీ పథకంలో పంపిణీ చేశామని, రానున్న రోజులలో మరో 10 వేల కోట్లు కేటాయిస్తాం. 150 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించి ఆర్టీసీలో భా గస్వామ్యం చేశాం. మహిళలు తయారు చేసిన వస్తువులను సిటీలో శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాటు చేస్తున్నం. రైతు భరోసా స్కీంలో రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తాం. ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ' అని సీతక్క అన్నారు. అనంతరం 75వ భారత రాజ్యాంగ దినోత్సవా న్ని పురస్కరించుకొని అధికారులు, గ్రామస్థుల తో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా వంద రోజులు పూర్తి చేసు కున్న లబ్ధిదారులకు, ఉత్తమ గ్రామపంచాయతీ సిబ్బందిని మంత్రి సత్కరించారు.