TG : రాహుల్ సాధించిన విజయం ఇది : మంత్రి పొన్నం, కేశవరావు

Update: 2025-05-02 07:00 GMT

కులగణన, జనగణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సంతోషపెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ కే కేశవరావు. కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు చేసిన కులగణన చారిత్రాత్మకం అన్నారు. కేంద్రం నిర్దిష్ట టైంలోగా కులగణన, జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News