ఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పాలని తుమ్మలపై ఒత్తిడి

Update: 2023-08-25 06:30 GMT

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం రానున్నారు. తుమ్మల పాలేరు టికెట్‌ ఆశించడం.. కేసీఆర్‌ ఆ స్థానం కందాల ఉపేందర్‌ రెడ్డికి కేటాయించడం.. తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేయడం చకచకా జరిగిపోయాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత... హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికేందుకు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆయన అనుచరులు, అభిమానులు తరలివస్తున్నారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం నగరం వరకు వేల కార్లు.. బైకులతో మహా ర్యాలీ నిర్వహించనున్నారు. తుమ్మల వర్గం మహా ర్యాలీ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మహా ర్యాలీ ద్వారా బలం, బలగాన్ని చూపాలని తుమ్మల వర్గం నేతలు పట్టుదలగా ఉన్నారు.

పాలేరు నుంచి కచ్చితంగా పోటీలో ఉండాల్సిందేనని.. అవసరమైతే బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్, లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మలపై అనుచరగణం ఒత్తిడి తీసుకొస్తోంది. ఐతే.. ఇప్పటి వరకు తుమ్మల ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్నఅనుచరగణం... ఆయన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News