Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అలజడి .. ఎద్దును చంపి తిన్న పెద్ద పులి..

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పెద్ద పులి అలజడి మొదలైంది.;

Update: 2022-08-22 15:23 GMT

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పెద్ద పులి అలజడి మొదలైంది. పలిమెల మండలం సింగంపల్లి నుంచి కామన్‌పల్లి ముకునూరు, తిమ్మేటిగూడెం అడవుల్లో పులి సంచరిస్తోంది. పులి పాదముద్రలను గుర్తించారు పలిమెల అటవీశాఖ అధికారులు. ఈ తెల్లవారుజామున ముకునూరు గ్రామపంచాయితీ పరిధిలోని తిమ్మెటిగూడెం గ్రామ సమీపంలోని ఉన్న అడవిలో ఎద్దును చంపి తిన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పులి సంచారంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పశువుపై దాడి చేసిందని, అయితే ఆహారం పూర్తిగా తినకపోవడంతో.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. పశువుల కాపరులు, ప్రజలు అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పంటపొలాల్లో ఎవరైనా ఉచ్చులు, విద్యుత్‌ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలన్నారు. పులికి ఎలాంటి హానీ జరిగిన కఠిన చర్యలు తప్పవన్నారు అటవీ అధికారులు.

Tags:    

Similar News