గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్, హైదర్‌నగర్, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్‌నగర్, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.
రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ మాన్ సూన్ బృందాలు రంగంలోకి దిగాయి.
హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం పడనుందని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయని.. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుందని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది.