Revanth Reddy : బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ను ముట్టడించారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy : బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు... టీఆర్‌ఎస్ విధానం వల్ల ప్రగతి భవన్‌ను ముట్టడిస్తున్నారని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.;
Revanth Reddy : బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు... టీఆర్‌ఎస్ విధానం వల్ల ప్రగతి భవన్‌ను ముట్టడిస్తున్నారని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో ఎంతో అవసరం ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకి వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు. స్థానికులను స్థానికేతరులుగా మార్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 317 జీవో వల్ల ఉద్యోగుల భవిష్యత్ చీకట్లోకి వెళుతుందన్నారు. వీటిపై పోరాటం చేయాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్‌లోకి హర్షవర్ధన్ వచ్చారని రేవంత్ తెలిపారు.