నేను ఉన్నన్నాళ్లు తెలంగాణకు వేరే వాళ్లు నాయకత్వం వహించలేరు: రేవంత్
షర్మిలను ఉద్దేశిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు;
షర్మిలను ఉద్దేశిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. షర్మిల ఏపీ మనిషన్నారు.. తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ వాళ్లు పరిపాలించుకోవడానికన్నారు.. షర్మిల వచ్చి తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్లు వచ్చి తెలంగాణకు నాయకత్వం వహించరని చెప్పారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు పనిచేస్తే స్వాగతిస్తానన్నారు.. షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.. తాను పీసీసీ చీఫ్‌గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని కుండబద్దలు కొట్టారు. షర్మిల తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపర్చడమేనన్నారు రేవంత్ రెడ్డి.