రూ. వెయ్యి కోట్ల భూములు కొట్టేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో పాదర్శకంగా భూ రికార్డులు ఉండేవని.. ఇప్పుడు నిషేధిత భూములను కూడా దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు

Update: 2023-06-12 13:30 GMT

కాంగ్రెస్‌ పాలనలో పాదర్శకంగా భూ రికార్డులు ఉండేవని.. ఇప్పుడు నిషేధిత భూములను కూడా దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.. వెయ్యి కోట్ల రూపాయల భూములను కొట్టేస్తున్నారంటూ ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు.. ధరణి సమస్యలు పరిష్కారం కాక రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు.. సమస్యల పరిష్కారం కోసం 30శాతం కమిషన్లు అడుగుతున్నారని రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు.

కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యూజ్‌ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకొస్తామన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ భూములపై విచారణ జరిపిస్తామన్నారు..

Tags:    

Similar News