యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని, అయితే పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇలా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.
కాగా, ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. యూత్ కాంగ్రెస్ నేతలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.