తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన..తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే విస్తృతం అభిప్రాయ సేకరణ జరిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు.. ఇలా అందరితో సమావేశమై పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు చేశారు. ఈ రిపోర్టును హైకమాండ్‌కు నివేదించనున్నారు ఠాగూర్. ఆ తర్వాత కొత్త చీఫ్ ను ప్రకటించనున్నారు. అటు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. సీనియర్లంతా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. విడివడిగా సమావేశాలు ఏర్పాటు చేసి మంతనాలు జరిపారు. సీఎల్పీ ఆఫీసులో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,పొడెం వీరయ్య, జగ్గారెడ్డి, కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. భేటీ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీభవన్‌లో ఠాగూర్‌ను కలిశారు.