నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పీడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా కసరత్తు;
తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పీడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గాంధీభవన్ ప్రకాశం హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జి మానిక్‌రావ్ ఠాక్రే పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు.. అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ సభ్యులు హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల వేగం పెంచింది. రాష్ట్రంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేట్టింది తెలంగాణ కాంగ్రెస్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్ల తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్ రెండున గ్రామ గ్రామానా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.ఈ అంశాలపైన చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నారు.