Hanumakonda : హనుమకొండ జిల్లాలో రాకపోకలు బంద్

Update: 2025-09-29 08:00 GMT

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్, హిందూపూర్ గ్రామాలలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉప్పొంది ప్రవహిస్తుంది. అటు వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు భారీ కేట్లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ మత్తడి చెరువు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్లాల్సిన వాహనాలను గూడెప్పాడు, పరకాల, రేగొండ, జాకారం మీదుగా ములుగు వైపుగా దారి మళ్ళించారు. ములుగు నుంచి వచ్చే వాహనాలను అదే మార్గంలో దారి మళ్లించారు.

Tags:    

Similar News