TRS Counter : అమిత్‌షా ప్రసంగమంతా అబద్దాలే : మంత్రి జగదీష్ రెడ్డి

TRS Counter : మునుగోడు సభలో అమిత్‌షా స్పీచ్‌పై సెటైర్లు వేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌.

Update: 2022-08-22 01:58 GMT

TRS Counter : మునుగోడు సభలో అమిత్‌షా స్పీచ్‌పై సెటైర్లు వేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌. కుటుంబ పాలనపై అమిత్‌షా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రెటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇక ఆ తండ్రి..సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారు. అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా, భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరఫున ప్రచారం చేయడానికి వచ్చారు. అలాంటి తండ్రి..కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తారు'అంటూ కేటీఆర్‌ సెటైర్లు వేశారు.

మరోవైపు మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్‌ షా,బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనన్నారు. అన్నీ నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు.

ఇక సీఎం ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా బీజేపీ నేతలకు లేదంటూ ఘాటుగా విమర్శించారు మంత్రి. దిగజారుడుతనం అమిత్‌షా మాటల్లో వినిపించిందని.షా వ్యాఖ్యలు కేంద్రహోం మంత్రి స్థాయిలో లేవని, ఫక్తు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం తప్ప మరొకటి మాట్లాడలేదని విమర్శించారు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబీమా అన్న మంత్రి.. ఫ్లోరైడ్‌ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా? నిలదీశారు.

మరోవైపు పెట్రోల్‌ ధరలపై అమిత్ షా మాటలు దొంగే దొంగ అన్నట్లుందన్నారు. ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్‌ పాత్ర పోషించారన్నారు. కేంద్ర హోం మంత్రి వరాలు ప్రకటిస్తారని మునుగోడు ప్రజలు ఆశపడ్డారని, షా మాటలు వారిని నీరుగార్చాయన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులనీ, బీజేపీకి తప్పక మీటరు బిగిస్తరన్నారు. ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్‌ దక్కదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News