ఈనెల 7న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం
ఈనెల 7న మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది..;
ఈనెల 7న మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్ పర్సన్లు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.