హుజురాబాద్‌లోనూ నాగార్జున సాగర్ రీపిట్ అవుద్ది : మంత్రి తలసాని
దళితబంధు కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన పథకం కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.;
దళితబంధు కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన పథకం కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిరంతరం ప్రజల మధ్య ఉన్న నాయకుడుని, హుజురాబాద్‌లోనూ నాగార్జున సాగర్ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే రెండు కాస్త మూడు అవుతాయని, గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని కామెంట్ చేశారు. బీసీ వర్గానికి సీఎం కేసీఆర్ ఎన్నో రాజకీయ పదవులు ఇచ్చారని గుర్తుచేశారు.